అడవి వృక్షములో జల్దరు వృక్షమెట్లున్నదో
పరిశుద్దల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభువి
పాడెదన్ నాదు ప్రియుని జీవికాలమెల్ల
అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను
1. నింద దూషణ ఇరుకులలో – నను సుగంధముగ
మార్చెన్ నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమిచ్చితివే ||పాడెదా||
2. నా కష్ట తరంగములలో – దుఖ సాగరములో యుండగా
నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే ||పాడెదా||
3. ఆనంద భరితమైన నేను నీ ప్రేమలో నుండుటకు
నీ స్వరము నాకతి మధురం-నీ ముఖము మనోహరము ||పాడెదా||
4. నీ చిత్తము చేయుటకు – నన్ను నీకు సమర్పించెదన్
నా పరుగును తుదముట్టించి – నీ సన్నిధిలో నుండెదన్ ||పాడెదా||
Back to list | Sunday Songs list
Listen on YouTube