Aascharyamaina prema - ఆశ్చర్యమైన ప్రేమ.

ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది
నన్ను జయించె నీ ప్రేమ (2)        ||ఆశ్చర్యమైన||

1. పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే         ||ఆశ్చర్యమైన||

2. పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే         ||ఆశ్చర్యమైన||

3. శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు         ||ఆశ్చర్యమైన||

4. నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే         ||ఆశ్చర్యమైన||

Back to list | Sunday Songs
Listen this song on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel