ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ||2||
ఆరాధన ఆరాధన ||2||
నీ మేలులకై ఆరాధన – నీ దీవెనకై ఆరాధన ||2||
ఆరాధన ఆరాధన ||2||
దినమెల్ల నీ చేతులు చాపి
నీ కౌగిలిలో కాపాడుచుంటివే ||2||
నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై
నా పూర్ణ హృదయముతో సన్నుతింతును ||2||
ఆరాధన ఆరాధన ||2||
నీ ప్రేమకై ఆరాధన – నీ జాలికై ఆరాధన ||2||
ఆరాధన ఆరాధన ||2||
ధనవంతులుగా చేయుటకు
దారిద్య్రత ననుభవించినావు ||2||
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా
పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను ||2||
ఆరాధన ఆరాధన ||2||
నీ కృప కొరకై ఆరాధన – ఈ స్థితి కొరకై ఆరాధన ||2||
ఆరాధన ఆరాధన ||2|| ||ఆరాధనకు||
Back to list | Sunday Songs list
Listen on YouTube