Aanandame Paramaanandame - ఆనందమే పరమానందమే.

ఆనందమే పరమానందమే
ఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2)
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన
అక్షయుడా నీకే స్తోత్రము (2).  ||ఆనందమే||

1. పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే
జీవ జలములు త్రాగనిచ్చితివే (2)
నా ప్రాణమునకు సేదదీర్చితివి
నీతియు శాంతియు నాకిచ్చితివే (2).  ||ఆనందమే||

2. గాఢాంధకారము లోయలలో నేను
సంచరించినా దేనికి భయపడను (2)
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును
అనుదినం అనుక్షణం కాపాడునే (2).  ||ఆనందమే||

3.నా శత్రువుల ఎదుటే నీవు
నాకు విందును సిద్ధము చేసావు (2)
నీతో నేను నీ మందిరములో
నివాసము చేసెద చిరకాలము (2).  ||ఆనందమే||

Back to List | Sunday Songs List
Listen this song on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel