Aananda Yaatra - ఆనంద యాత్ర

ఆనంద యాత్ర
ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన
యెరుషలేము యాత్ర
మన.. యేసుతో నూతన
యెరుషలేము యాత్ర ||ఆనంద యాత్ర||

1. యేసుని రక్తము
పాపములనుండి విడిపించెను (2)
వేయి నోళ్ళతో స్తుతించినను
తీర్చలేము ఆ ఋణమును (2) ||ఆనంద యాత్ర||

2. రాత్రియు పగలును
పాదములకు రాయి తగలకుండా (2)
మనకు పరిచర్య చేయుట కొరకై
దేవదూతలు మనకుండగా (2) ||ఆనంద యాత్ర||

3. కృతజ్ఞత లేని వారు
వేలకొలదిగ కూలినను (2)
కృపా వాక్యమునకు సాక్షులమై
కృప వెంబడి కృప పొందెదము (2) ||ఆనంద యాత్ర||

4. ఆనందం ఆనందం
యేసుని చూచే క్షణం ఆసన్నం
ఆత్మానంద భరితులమై
ఆగమనాకాంక్షతో సాగెదం ||ఆనంద యాత్ర||

Back to list | Sunday Songs list
Listen on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel