Aakarshinchumu Devaa - ఆకర్షించుము దేవా

ఆకర్షించుము దేవా మమ్మాదరింపగ రావా
కాంక్షనీయుడా నీవే మా దేవ - కాపరి మా యేసు దేవా

1. సాతాను శోధనలు మములాగుచున్నవి దేవా
కష్టాలు కన్నీళ్ళు మా గుండె నిండెను దేవా -2
లోకము మమ్ము పిలుచుచున్నది - శోకసముద్రం పొంగుచున్నది - 2 ||ఆకర్షించుము||

2. నీ ఆత్మ వరములను మాకిమ్ము మా యేసు దేవ
నీ సేవ చేయుటకు మా శక్తి చాలదు దేవా -2
సుఖము శరీరము కోరుచున్నది - మనస్సు ధనాశకు లాగుచున్నది - 2 ||ఆకర్షించుము||

3. మా ప్రియుడా నడుపుమయా - నీ ప్రేమ నీడలలోన
పాలు గోధుమ సారములు ఉన్నాయి - నీ సన్నిధాన -2
పాపపు చెలిమి పిలుచుచున్నది - చీకటి బలము లాగుచున్నది - 2 ||ఆకర్షించుము||

4. జీవజలాల ఊటలతో మా తోట తడుపుము దేవా
తియ్యని తేనీయ మాటలతో మా నోరు నింపుము దేవా -2
సుమమధుర సహవాసముతో సాగెద నిరతము నీ సేవలో - 2 ||ఆకర్షించుము||

Songs List | Sunday Songs
Listen to this Song on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel