Aakaashamandhu Neevu Thappa - ఆకాశమందు నీవు తప్ప

ఆకాశమందు నీవు తప్ప ప్రభువా
ఎవరు ఉన్నారు వేరెవ్వరు ఉన్నారు (2)
నీవు మాకుండగా లోకములోనిది ఏదియు మాకు అక్కరలేదే
ప్రభువా నీవు మాకుంటే చాలు (2)   ||ఆకాశ||

1. ఆకాశాము నీ సింహాసనము
ఈ భూమి నీ పాదపీఠము (2)
నిన్ను నేను స్తుతియించెదను
నిత్యము నిన్నే కొనియాడెదను (2)  ||ఆకాశ||

2. నా తల్లిదండ్రులు  - నన్ను విడనాడినా
నా బంధు స్నేహితులు  - మరచిపోయిన (2)
మరువనంటివే విడువనంటివే
ప్రేమతో నన్నూ ఆదరించినావే (2)  ||ఆకాశ||

Back to list | Sunday Songs list
Listen on
YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel