ఆధారం నీవే - ఆదరణ నీవే
ఆశ్రయము నీవే నా యేసయ్యా ||2||
నన్నావరించి నడిపించు మేఘమా
నా ముందు నడిచే అగ్ని స్థంభమా. ||2|| ||ఆధారం||
1. నన్నెంతగానో ప్రేమించి నీవు
గొల్వతా కొండకు నను మోసినావు ||2||
అమరత్వానికి మార్గము చూపిన
పునరుత్థానుడా స్తోత్రము. ||2|| ||ఆధారం||
2. నిజమైన స్నేహితునిగా దరిచేరి
నీలోని సుగుణాలు బోధించితివే ||2||
నీ సహవాసమే మనిషిగ మార్చినది
సుగుణాల సంపన్నుడా స్తోత్రము ||2|| ||ఆధారం||
3. నా దాగుచోటు నీవే యేసయ్యా
ఏ తెగులు ఎన్నడు దరిచేరనియ్యవు ||2||
నా ఎదుగుదలకు పందిరి నీవే
నా క్షేమాధారమా స్తోత్రము ||2|| ||ఆధారం||
Back to list | Sunday Songs list
Listen on YouTube